Norway Chess : నార్వే చెస్ టోర్నమెంట్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద (R Praggnanandhaa) విజయంతో ముగించాడు. శనివారం జరిగిన 10వ, ఆఖరి రౌండ్లో జపాన్ ఆటగాడు హికరు నకమురా(Hika Nakamura)ను చిత్తుగా ఓడించాడు. రెండో స్థానం కోసం జరిగిన పోరులో ప్రజ్ఞానందకు నకుముర గట్టి పోటీనిచ్చాడు. అయితే.. టై బ్రేక్‌లో భారత స్టార్ ప్రత్యర్థికి చెక్ పెట్టాడు. అయినప్పటికీ ప్రజ్ఞానంద మూడో ర్యాంక్‌తో సరిపెట్టుకోల్సి వచ్చింది.
సొంతగడ్డపై జరిగిన ఈ టోర్నీలో వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్(Magnus Carlson) విజేతగా నిలిచాడు. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఫాబియానో కరౌనలు పోటాపోటీగా తలపడ్డారు. చివరకు మ్యాచ్ డ్రాగా ముగియడంతో టై బ్రేకర్ ఆధారంగా విజేతను నిర్ణయించారు.
✨6th time✨ pic.twitter.com/OSmjz4aSSb
— Norway Chess (@NorwayChess) June 8, 2024
దాంతో, కార్ల్సన్ ఆరోసారి నార్వే చెస్ ట్రోఫీ చాంపియన్‌గా రికార్డు సృష్టించాడు. ఇక మహిళల విభాగంలో జు వెంజున్ చాంపియన్‌గా అవతరించింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ప్రజ్ఞానంద సోదరి ఆర్ వైశాలి(R Vaishali) నాలుగో స్థానానికే పరిమితమైంది.