Tamilanadu CM Stalin | కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ముంబాయికి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ గ్యాలరీల నిర్వాహకుడు నిచోలై సచ్‌దేవ్‌ని త్వరలోనే ఆమె వివాహం చేసుకోనున్నారు. ఈ ఏడాది మార్చిలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇక జూలైలో వీరి వివాహం జరుగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పెళ్లి వేడుకలకు సిద్దమవుతుంది. ఇక తమిళనాడులో ఉన్న పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులను వరలక్ష్మి తమ పెళ్లికి ఆహ్వానిస్తుంది.
తాజాగా వరలక్ష్మి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దంపతులను కలిసి ఆహ్వానం అందించింది. శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్‌లతో కలిసి స్టాలిన్ ఇంటికి వెళ్లిన వరలక్ష్మి తమ వివాహానికి రావాలని కోరింది. ఈ సందర్భంగా స్టాలిన్ నుంచి ఆశీస్సులు తీసుకుంది. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Met the Hon’ble Chief Minister Thiru @mkstalin sir & Durga mam and seeked their blessings..Congratulations on your win sir…Thank you so much for meeting us..@realsarathkumar @realradikaa @rayane_mithun #poojasarathkumar pic.twitter.com/Gopld9K2dl
— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) June 8, 2024