హైదరాబాద్ : 2026లో రిటైర్ ( Retirement ) అవుతున్న రాజ్యసభ ( Rajya Sabha ) సభ్యుల జాబితాను రాజ్యసభ సచివాలయం శుక్రవారం బులిటెన్‌ను విడుదల చేసింది . తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్ సురేష్‌రెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్‌మను సింఘ్వి ఏప్రిల్ 9న రిటైర్ కానున్నారని వెల్లడించింది.
జూన్‌లో నలుగురు ఆంధ్రప్రదేశ్ సభ్యులైన వైకాపా ఎంపీలు అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, టీడీపీ సభ్యుడు సానా సతీష్ రిటైర్ట్ కానున్నట్లు వివరించింది.ఈ సందర్భంగా రాజ్యసభ సచివాలయం అన్ని రాష్ట్రాలు, నామినేటెడ్ సభ్యుల రిటైర్మెంట్ జాబితాను విడుదల చేసింది .