Zohran Mamdani | మీ పని మీరు చూసుకోండి.. జొహ్రాన్ మమ్దానీకి భారత్ ఘాటు రిప్లై..
Zohran Mamdani : ఢిల్లీ అల్లర్ల కేసు విషయంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్ కు మద్దతుగా అమెరికాలోని న్యూయార్క్ కొత్త మేయర్ జొహ్రాన్ మమ్దానీ లేఖ రాయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.
Zohran Mamdani : ఢిల్లీ అల్లర్ల కేసు విషయంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్ కు మద్దతుగా అమెరికాలోని న్యూయార్క్ కొత్త మేయర్ జొహ్రాన్ మమ్దానీ లేఖ రాయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాల న్యాయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి బదులు.. సొంత బాధ్యతలపై దృష్టి సారించాలని సూచించింది.
ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి రణధీర జైశ్వాల్ ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఇతర దేశాల న్యాయ వ్యవస్థను గౌరవించాలని సూచించారు. జొహ్రాన్ మమ్దానీ.. ఇటీవలే న్యూయార్క్ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇదే సమయంలో అక్కడ ఉమర్ ఖలీద్ తల్లిదండ్రుల్ని కలిశాడు. అంతకుముందే ఉమర్ ఖలీద్ కు మద్దతుగా ఒక లేఖ రాశాడు. ఉమర్ మాటలు ఇతరులకు చేదుగా అనిపించవచ్చని, కొంతమంది వాటిని జీర్ణించుకోలేరని లేఖలో పేర్కొన్నాడు. ఉమర్ తల్లిదండ్రుల్ని కలుసుకోవడం ఆనందంగా ఉందన్నాడు. ఈ లేఖకు సంబంధించిన ఫొటోను ఉమర్ ఫ్రెండ్ బానోజ్యోత్స్న సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే లేఖను ఉమర్ తల్లిదండ్రులకు మామ్దానీ అందించారు.
అయితే, ఈ అంశంపై భారత్ స్పందించింది. ఒక దేశానికి చెందిన ప్రజాప్రతినిధులు ఇతర దేశాల్లో స్వేచ్ఛగా పనిచేసే న్యాయ వ్యవస్థను గౌరవించాలని, వ్యక్తిగత అభిప్రాయాలు తమ అధికారంలోకి తీసుకురాకూడదని రణధీర్ సూచించారు. అలాగే ఇలాంటి కామెంట్స్ చేసే బదులు ప్రజా ప్రతినిధులు తమ సొంత బాధ్యతల్ని నెరవేర్చడంపై దృష్టి సారించాలని మామ్దానీకి సూచించారు. ఢిల్లీ అల్లర్ల కేసులో ఇటీవలే ఉమర్ ఖలీద్ కు సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

