Bala Devi : భారత సీనియర్ ఫుట్‌బాలర్ బాలా దేవీ (Bala Devi) చరిత్ర సృష్టించింది. గోల్ మెషిన్‌గా పేరొందిన ఆమె అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 50వ గోల్ కొట్టింది. నేపాల్ ఆతిథ్యమిస్తున్న ఎస్ఏఎఫ్ఎఫ్ మహిళల చాంపియన్‌షిప్ (SAFF Womens Championship)లో బాల ఈ మైలురాయికి చేరువైంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఈ ఘనత సాధించింది.
ఫార్వర్డ్ ప్లేయర్ అయిన 34 ఏండ్ల బాల 34వ నిమిషంలో ప్రత్యర్థి గోల్ కీపర్‌ను ఏమారుస్తూ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపింది. దాంతో, ఇంటర్నేషనల్‌గా అర్ధ సెంచరీ కొట్టేసింది. దేశం తరఫున ఆడుతూ అంతర్జాతీయంగా రికార్డు గోల్ కొట్టడం చాలా సంతోషంగా ఉందని బాల వెల్లడించింది.
“She Power” Bala Devi credits her success to hard work.💪💯
Her achievement was celebrated not only by Indian fans but also by local supporters, as the crowd in Nepal honoured her with a standing ovation after the match. 🙌
For more details.⬇️https://t.co/xoH4BPU3PK… pic.twitter.com/MED6muL2Kj
— Indian Football Team (@IndianFootball) October 19, 2024
‘దేశం తరఫున 50 గోల్స్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సందర్భం. ఈ రికార్డ్ గోల్‌ను మా నాన్నకు అంకితం చేస్తున్నా. ఎందుకంటే.. ఆయనే నాకు సర్వస్వం. చిన్నప్పటి నుంచి ఆయన బంతిని ఎలా తన్నాలి, గోల్ ఎలా చేయాలి.. ఇలా ఫుట్‌బాల్‌కు సంబంధించిన ప్రతిదీ నాకు నేర్పారు’ అని బాల మ్యాచ్ అనంతరం తెలిపింది.
మణిపూర్‌కు చెందిన ఫార్వర్డ్ ప్లేయర్‌గా 2005లో జట్టులోకి వచ్చింది. తన సుదీర్ఘ కెరీర్లో ఆమె ఎన్నో ఘనతలు సాధించింది. తన కెరీర్ గురించి ఒక్క ముక్కలో వర్ణిస్తూ బాల ‘షీ పవర్’ (She Power) అని చెప్పింది. నా సుదీర్ఘ ప్రయాణాన్ని సీ పవర్ అని చెబుతాను. ఎందుకంటే.. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ నేను ఎంతో కష్టపడుతాను. నా గురించి జాగ్రత్తలు తీసుకుంటూనే ఇంటి పనులు చక్కబెడుతాను. ఇదంతా ఎంతో కష్టమైనది. ఏది కూడా అంత తేలికగా రాదు అని బాల చెప్పింది.