Jasprit Bumrah | భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. 2024 సంవత్సరానికి ఐసీసీ బెస్ట్ మెన్స్ క్రికెటర్‌గా బుమ్రా ఎంపికయ్యాడు. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న బుమ్రాను అవార్డు వరించింది. ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌లో భారత్ టైటిల్‌ను సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. 2024 ఏడాదికి ఇప్పటికే ఐసీసీ బెస్ట్ టెస్ట్ ప్లేయర్‌గా ఎంపికైన బుమ్రా.. తాజాగా బెస్ట్ క్రికెటర్ అవార్డు వరించింది.
ఇటీవల టెస్టుల్లో బుమ్రా 200 వికెట్ల క్లబ్లో చేరాడు. 2024లో టెస్టుల్లో అద్భుతంగా రాణించాడు. దాదాపు 13 మ్యాచుల్లో 14.92 సగటు, 30.16 స్ట్రయిక్ రేట్‌తో 71 వికెట్లు తీశాడు. ఈ ఫార్మాట్లో ఏ బౌలర్ ఈ ఘనత సాధించలేకపోయాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలమైన పరిస్థితులు అయినా.. స్వదేశంలో ఫాస్ట్ బౌలర్లకు కఠినంగా ఉండే పిచ్‌లపైన అయినా.. బుమ్రా ఏడాది కాలంలో బాల్‌తో అద్భుతాలు చేశాడు. మిస్టరీ బౌలర్ ఆస్ట్రేలియా పర్యటనలో ఆకట్టుకున్నాడు.
బుమ్రా ఐసీసీ బెస్ట్ ప్లేయర్‌గా నిలిచి.. సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ అవార్డుకు ఎంపికైన ఐదో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ ఏడాది బుమ్రాతో పాటు ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్, ఇంగ్లాండ్‌కు చెందిన జో రూట్, హ్యారీ బ్రూక్ సైతం ఈ అవార్డు రేసులో నిలిచినా.. వారందరినీ పక్కకు నెట్టి సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డుకు ఎంపికయ్యాడు. గతంలో టీమిండియా తరఫున రాహుల్ ద్రవిడ్ (2004), సచిన్ టెండూల్కర్ (2010), రవిచంద్రన్ అశ్విన్ (2016), విరాట్ కోహ్లీ (2017-2018) ఈ అవార్డును అందుకున్నారు. తాజాగా ఐసీసీ బుమ్రా సర్గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డుకు బుమ్రా ఎంపికైనట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
గతేడాది టెస్టులతో పాటు పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనూ బుమ్రా బంతితో రాణించాడు. ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాకింగ్స్లో 900 పాయింట్ల మార్క్‌ని దాటాడు. గతేడాది చివరి వరకు 907 పాయింట్లు బుమ్రా ఖాతాలో ఉన్నాయి. ఐసీసీ ర్యాకింగ్స్ చరిత్రలో ఏ బౌలర్ సాధించనంత పాయింట్లు సాధించాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకోవడంలో బుమ్రా ముఖ్య భూమిక పోషించాడు. గత సంవత్సరం బుమ్రా ఇంగ్లాండ్‌తో జరిగిన స్వదేశీ టెస్ట్ సిరీస్‌తో అద్భుతంగా రాణించాడు. ఆ తర్వాత అమెరికా, వెస్టిండిస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆకట్టుకున్నాడు. టోర్నీలో 8.26 సగటుతో 15 వికెట్లు తీశాడు. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ టైటిల్‌ను సాధించింది. బుమ్రా అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌కు ఎంపికయ్యాడు.
An unforgettable year for the irrepressible Jasprit Bumrah, who claims the Sir Garfield Sobers Trophy for 2024 ICC Men’s Cricketer of the Year 🙌 pic.twitter.com/zxfRwuJeRy
— ICC (@ICC) January 28, 2025
Milie Kerr: కివీస్ ఆల్‌రౌండర్‌కు ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
Virat Kohli | ఢిల్లీ రంజీ జట్టులోకి చేరిపోయిన కోహ్లీ.. అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్