కౌలాలంపూర్: మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీని భారత డబుల్స్ స్టార్ ద్వయం సాత్విక్-చిరాగ్ విజయంతో ప్రారంభించింది. పురుషుల డబుల్స్‌లో ఈ జోడీ 21-10, 16-21, 21-5తో కై వై-లు మింగ్(మలేషియా)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరింది. సింగిల్స్ విభాగాల్లో హెచ్ఎస్ ప్రణయ్, మాళవిక బన్సోద్ ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ 21-12, 17-21, 21-15తో బ్రియాన్ యాంగ్ (కెనడా)ను ఓడించాడు.
మరో మ్యాచ్‌లో ప్రియాన్షు రజావత్ 11-21, 16-21తో షి ఫెంగ్ లి (చైనా) చేతిలో చిత్తయ్యాడు. మహిళల సింగిల్స్‌లో బన్సోద్ 21-15, 21-16తో జిన్ వీ(మలేషియా)ను ఓడించింది. కానీ ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ ఓటమి పాలయ్యారు. మహిళల డబుల్స్‌లో తనీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప సైతం తొలి రౌండ్లోనే నిష్క్రమించారు.