తిరువనంతపురం : సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌నకు ముందు న్యూజిలాండ్‌తో తమ ఆఖరి టీ20 ఆడేందుకు గాను భారత క్రికెట్ జట్టు గురువారం తిరువనంతపురం చేరుకుంది. ఈ సందర్భంగా టీమ్ఇండియా సారథి సూర్యకుమార్ యాదవ్‌తో పాటు పలువురు క్రికెటర్లు అనంత పద్మనాభస్వామి దర్శించుకున్నారు. సూర్యతో పాటు అక్షర్, రింకూ, వరుణ్, రవి, కుల్దీప్ ఆలయానికి వచ్చినవారిలో ఉన్నారు.
ఇక భారత జట్టు.. నేడు రాత్రి కివీస్‌తో ఐదో టీ20లో తలపడనుంది. ఇప్పటికే సిరీస్‌లో 3-1 ఆధిక్యంలో ఉన్న మెన్ ఇన్ బ్లూ.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను విజయంతో ముగించాలని ఆశిస్తున్నది. వచ్చే నెల 7 నుంచి ప్రారంభం కాబోయే టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత్‌కు ఇదే చివరి టీ20 సన్నాహకం కావడం గమనార్హం. ‘లోకల్ బాయ్’ సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో అయినా చెలరేగాలని స్థానిక అభిమానులు వేయి కండ్లతో వేచిచూస్తున్నారు.