Team India | ఎట్టకేలకు బార్బడోస్‌ను వీడిన టీమ్ఇండియా.. ప్రత్యేక ఫ్లైట్‌లో భారత్‌కు పయనం
Team India | బెరిల్ హరికేన్ (hurricane) ముప్పుతో ద్వీప దేశం బార్బడోస్ (Barbados)లో చిక్కుకుపోయిన భారత క్రికెట్ జట్టు (Team India) ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరింది.
Team India | బెరిల్ హరికేన్ (hurricane) ముప్పుతో ద్వీప దేశం బార్బడోస్ (Barbados)లో చిక్కుకుపోయిన భారత క్రికెట్ జట్టు (Team India) ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో రోహిత్ సేత భారత్‌కు పయనమైంది. వీరు గురువారం ఉదయానికి ఢిల్లీ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ కార్యదర్శి జై షా సహా టీమ్ఇండియా క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది, బీసీసీఐ ప్రతినిధి బృందం, స్పోర్ట్స్ జర్నలిస్టులు అంతా కలిపి 70 మంది వరకు ఉన్నట్లు అంచనా. వీరంతా బార్బడోస్‌ను వీడి.. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో స్వదేశానికి పయనమయ్యారు.
#WATCH | Indian cricket team leave from Barbados. The team will reach Delhi on July 4, early morning.
The flight arranged by BCCI’s Jay Shah is also carrying the members of Indian media who were stranded in Barbados pic.twitter.com/V0ScaaojBv
— ANI (@ANI) July 3, 2024
కాగా, వెస్టిండీస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో గత నెల 29న శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకూ నరాలుతెగే ఉత్కంఠతో హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో భారత్ 7 పరుగుల తేడాతో సఫారీలను మట్టికరిపించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. పొట్టి ఫార్మాట్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంతవరకు ఇదే అత్యధిక స్కోరు. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో 17 ఏండ్ల (2007) తర్వాత టీ20 వరల్డ్ కప్‌ను భారత్ ముద్దాడింది.
ఇక మ్యాచ్ అనంతరం జులై 1న వారు అక్కడి నుంచి బయల్దేరి రావాల్సి ఉంది. అయితే, బెరిల్ తుఫాన్ కారణంగా అక్కడ చిక్కుకుపోయారు. ముందుగా వారు జులై 2న అంటే మంగళవారం సాయంత్రం 6 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) అక్కడి నుంచి బయల్దేరి బుధవారం రాత్రి 7:45 గంటలకు ఢిల్లీ చేరుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే, హరికేన్ ముప్పుతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా భారత జట్టు ప్రయాణం ఆలస్యం అయ్యింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు వారంతా స్వదేశానికి బయల్దేరారు. సొంతగడ్డపై భారత జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు యావత్ దేశం సిద్ధంగా ఉంది.
Also Read..
T20 World Cup | వరల్డ్ కప్ వస్తోంది.. స్పెషల్ వీడియో పోస్ట్ చేసిన బీసీసీఐ
Rajasthan | కదులుతున్న కారుపై పడిన హైవోల్టేజ్ విద్యుత్ స్తంభం.. షాకింగ్ వీడియో
Assam Floods | కజిరంగ నేషనల్ పార్క్‌ను ముంచెత్తిన వరద.. నీట మునిగిన జంతువులు.. VIDEO
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Barbados
- BCCI
- hurricane
- Team india
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

