T20 World Cup | వరల్డ్ కప్ వస్తోంది.. స్పెషల్ వీడియో పోస్ట్ చేసిన బీసీసీఐ
T20 World Cup | టీ20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup) ట్రోఫీకి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను బీసీసీఐ ఎక్స్ వేదికగా పంచుకుంది.
T20 World Cup | 17 ఏండ్ల (2007) తర్వాత టీ20 వరల్డ్ కప్‌ను భారత్ ముద్దాడింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో యావత్ దేశం సంబరాలు చేసుకుంటోంది. టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న తర్వాత భారత జట్టు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ (BCCI) టీ20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup) ట్రోఫీకి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను ఎక్స్ వేదికగా పంచుకుంది. ‘వరల్డ్ కప్ వస్తోంది’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.
బెరిల్ హరికేన్ (hurricane) ముప్పుతో మూడు రోజులుగా ద్వీప దేశం బార్బడోస్ (Barbados)లో చిక్కుకుపోయిన భారత క్రికెట్ జట్టు (Team India) ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరినట్లు తెలిసింది. ఇవాళ సాయంత్రం భారత జట్టు ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, అనుకోని పరిస్థితుల కారణంగా వీరి ప్రయాణం కాస్త ఆలస్యమైంది. గురువారం ఉదయం 6 గంటలకల్లా ఢిల్లీలో ల్యాండ్ కానున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
It’s coming home 🏆#TeamIndia pic.twitter.com/Pxx4KGASb8
— BCCI (@BCCI) July 3, 2024
కాగా, వెస్టిండీస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో గత నెల 29న శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకూ నరాలుతెగే ఉత్కంఠతో హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో భారత్ 7 పరుగుల తేడాతో సఫారీలను మట్టికరిపించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. పొట్టి ఫార్మాట్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంతవరకు ఇదే అత్యధిక స్కోరు. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగారు.
దీంతో 17 ఏండ్ల (2007) తర్వాత టీ20 వరల్డ్ కప్‌ను భారత్ ముద్దాడింది. గత రెండు ప్రపంచకప్‌లలో తమను దెబ్బకొట్టిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ను ఇంటికి పంపిన రోహిత్ సేన.. ఫైనల్లో సమిష్టి ఆటతీరుతో సఫారీలను మట్టికరిపించింది. పురుషుల క్రికెట్లో భారత్ ఐసీసీ కప్‌ను అందుకోవడం ఇది నాలుగోసారి. వన్డే క్రికెట్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత్, పొట్టి ఫార్మాట్లో కూడా దానిని సమం చేసింది. దీంతో యావత్ భారతావని సంబురాల్లో మునిగి తేలుతోంది. ఇక సొంతగడ్డపై భారత జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు యావత్ దేశం సిద్ధంగా ఉంది. ఇక మ్యాచ్ అనంతరం జులై 1న వారు అక్కడి నుంచి బయల్దేరి రావాల్సి ఉంది. అయితే, బెరిల్ తుఫాన్ కారణంగా అక్కడ చిక్కుకుపోయారు.
Also Read..
Team India | బార్బడోస్ నుంచి భారత జట్టు రాక మరింత ఆలస్యం
Mumbai College | టీషర్ట్స్, చిరిగిన జీన్స్‌తో రావొద్దు.. విద్యార్థులకు ముంబై కళాశాల కీలక ఆదేశాలు
Bhole Baba: పరారీలో భోలే బాబా.. కొనసాగుతున్న పోలీసుల సెర్చ్ ఆపరేషన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

