Dinesh Karthik | మలయాళ సినిమాలపై ఫిదా.. ‘పొన్మన్’, ‘ఎకో’ చిత్రాలపై దినేశ్ కార్తీక్ ప్రశంసలు
Dinesh Karthik | టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత దినేశ్ కార్తీక్ (DK) మలయాళ సినిమాలపై ప్రశంసలు కురిపించాడు.
Dinesh Karthik | టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత దినేశ్ కార్తీక్ (DK) మలయాళ సినిమాలపై ప్రశంసలు కురిపించాడు. రిటైర్మెంట్ అనంతరం వ్యాఖ్యాతగా రాణిస్తున్న దినేష్ ఇటీవల మలయాళ చిత్రాలైన ‘పొన్మన్’ (Ponman)తో ‘ఎకో’ (Echo) చిత్రాలను చూసినట్లు ఈ చిత్రాలు అద్భుతంగా ఉన్నాయంటూ దినేష్ తెలిపాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
‘పొన్మన్’ సినిమా గురించి స్పందిస్తూ.. అందులో ప్రధాన పాత్ర పోషించిన నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్ నటనపై డీకే ప్రశంసలు కురిపించారు. “సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు బాసిల్ పాత్రతోనే మనం ప్రయాణం చేస్తాం. అతడి నటన అంతలా కట్టిపడేసింది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు” అని కొనియాడారు. అలాగే టెక్నికల్ వండర్ ‘ఎకో’ చిత్రం తనను షాక్‌కి గురిచేసిందని కార్తీక్ తెలిపారు. ఈ సినిమా గురించి చెబుతూ.. “సినిమాటోగ్రఫీ, లొకేషన్లు మరియు కథాంశం చాలా భిన్నంగా ఉన్నాయి. దర్శకుడు దిన్జిత్ ఈ చిత్రాన్ని అద్భుతమైన విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు. ఇలాంటి క్వాలిటీ సినిమాలు మలయాళం నుండి మరిన్ని రావాలి” అని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్తీక్ ఈ సినిమాలపై ప్రశంసలు కురిపించడంతో మలయాళ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Two high quality movies I’ve watched this last week
PONMAN n EKO
Unreal acting from @basiljoseph25 in ponman , you literally live the movie through him and as always solid from the supporting cast as well
EKO blew my mind in terms of cinematography,locations and such an…
— DK (@DineshKarthik) January 2, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

