Venky Atluri | నాని లేదా విజయ్ దేవరకొండ.. వెంకీ అట్లూరి నెక్స్ట్ మూవీ ఎవరితో అంటే…!
Venky Atluri | దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్తుతం వరుస విజయాలతో టాలీవుడ్లో మంచి జోరు మీదున్నారు. తొలి సినిమాతోనే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ఆ తర్వాత వచ్చిన రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయాయి. అయితే ‘సార్’, ‘లక్కీ భాస్కర్’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలతో వరుసగా మూడు విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూడు సినిమాల ద్వారా తన దర్శకత్వ ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు.
Venky Atluri | దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్తుతం వరుస విజయాలతో టాలీవుడ్లో మంచి జోరు మీదున్నారు. తొలి సినిమాతోనే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ఆ తర్వాత వచ్చిన రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయాయి. అయితే ‘సార్’, ‘లక్కీ భాస్కర్’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలతో వరుసగా మూడు విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూడు సినిమాల ద్వారా తన దర్శకత్వ ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వెంకీ అట్లూరి ఈ మూడు సినిమాలను తెలుగు హీరోలతో కాకుండా ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలతో తెరకెక్కించారు. ధనుష్‌తో ‘సార్’, దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’, సూర్యతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాలు రూపొందించారు. భాషతో సంబంధం లేకుండా మంచి కథను ఎంచుకుంటూ విజయాలు సాధిస్తున్నారు.
అయితే వరుసగా ఇతర భాషల హీరోలతోనే సినిమాలు చేస్తున్నారంటూ కొంతమంది నెటిజన్లు వెంకీ అట్లూరిపై విమర్శలు చేస్తున్నారు. తెలుగు దర్శకుడిగా ఉంటూ తెలుగు హీరోలతో సినిమాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకీ అట్లూరి తన తదుపరి సినిమాను టాలీవుడ్ హీరోతోనే చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తాజా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలను వెంకీ అట్లూరి కలిసి తన తదుపరి సినిమా కథకు సంబంధించిన ఆలోచనను వివరించినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఇంకా పూర్తి స్థాయి కథా చర్చలు, నేరేషన్ ప్రక్రియ జరగాల్సి ఉందని తెలుస్తోంది.
నాని లేదా విజయ్ దేవరకొండ.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ హీరోతో సినిమా చేసేందుకు వెంకీ అట్లూరి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రాజెక్టుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి వెంకీ అట్లూరి తన తదుపరి సినిమాతో తెలుగు హీరోను డైరెక్ట్ చేస్తారా? నాని, విజయ్ దేవరకొండలలో ఎవరు ఆయన కథకు ఓకే చెబుతారు? అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై స్పష్టత రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Venky Atluri | నాని లేదా విజయ్ దేవరకొండ.. వెంకీ అట్లూరి నెక్స్ట్ మూవీ ఎవరితో అంటే…!
BJP MLA | ఏపీ కూటమీలో లుకలుకలు.. రాజీనామా ఆలోచనలో బీజేపీ ఎమ్మెల్యే
Tollywood | టాలీవుడ్లో మళ్లీ పైరసీ కలకలం.. ‘ఆకాశంలో ఒక తార’ సహా నాలుగు కొత్త సినిమాల లీక్!
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం
Kaishika Dwadashi | తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

