Rohit Sharma | ప్రస్తుతం టీ20 క్రికెట్ ఆదరణ పెరుగుతున్నది. ఈ క్రమంలో వన్డే క్రికెట్ భవితవ్యంపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌తో కలిసి నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో రోహిత్ శర్మ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఎదుర్కొన్న సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇతర ఫార్మాట్లకు భిన్నంగా వన్డే క్రికెట్ ఎప్పుడూ సవాల్‌గా ఉంటుందని.. ప్రస్తుతం టీ20 క్రికెట్‌కు ప్రజాదరణ పెరుగుతున్నప్పటికీ అది అత్యంత గౌరవనీయమైన ఫార్మాట్లలో ఒకటిగా ఉందని వ్యాఖ్యానించారు. 50 ఓవర్ల ఫార్మాట్‌తో తనకు మంచి బంధం ఉందని.. క్రికెటర్‌గా తన బాల్యంతో ముడిపడి ఉందని తెలిపాడు. వన్డే క్రికెట్ శాశ్వతమైనా.. కాకపోయినా దాని గురించి చాలా విషయాలు చెబుతారనే విషయం తనకు తెలుసనని చెప్పాడు.
మనమందరం వన్డే ప్రపంచకప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ చూస్తు పెరిగామని.. తాము అందులో ఆడామని.. ఆ మ్యాచులన్నీ ఉత్తేజకరమైనవని చెప్పాడు. అవన్నీ గతానికి సంబంధించినవని తనకు తెలుసునని.. ఎందుకంటే ఇప్పుడు జనం టీ20 క్రికెట్‌ని చూస్తున్నారని.. కానీ, వన్డే క్రికెట్లో సవాల్ భిన్నంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. రోహిత్ కెప్టెన్సీలో ఇటీవల భారత జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోపీని గెలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఐదు మ్యాచుల్లో కలిపి రోహిత్ 180 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు. వన్డేల్లో రోహిత్ రికార్డు బాగుంది. 273 మ్యాచ్‌ల్లో 11,138 పరుగులు చేశాడు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో రాణించాడు. ప్రస్తుతం ఐపీఎల్ ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు బ్యాటింగ్‌తో ఆకట్టుకోలేకపోయాడు. ఐదు మ్యాచుల్లో కలిపి 11.20 సగటుతో 56 పరుగులు చేశాడు. ఈ సారి కొన్ని మ్యాచుల్లో రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు దిగడం విశేషం.