బే ఓవల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ 20లో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సెంచరీ సాధించాడు. కేవలం 49 బంతుల్లో 6 సిక్సర్లు, 10 ఫోర్లతో వంద పరుగులు చేశాడు. దీంతో, న్యూజిలాండ్ గడ్డ మీద పొట్టి క్రికెట్ ఫార్మాట్లో సెంచరీ చేసిన మొదటి భారత బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ టీ 20ల్లో ఇంగ్లండ్‌పై నాటింగ్హమ్లో మొదటి సెంచరీ (117 పరుగులు) చేశాడు.
రోహిత్ శర్మ తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్లో రెండు టీ 20 సెంచరీలు సాధించిన భారత బ్యాటర్‌గా సూర్యకుమార్ రికార్డు సాధించాడు. రోహిత్ శర్మ 2018లో ఈ ఫీట్ సాధించాడు. అంతేకాదు ఒక ఏడాదిలో వెయ్యి పరుగులు చేసిన మొదటి భారత ఆటగాడిగా నిలిచాడు. టీ 20ల్లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ అయిన సూర్య వరల్డ్‌కప్‌లోనూ అద్భుతంగా ఆడాడు.