పారిస్: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి పారిస్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ముగిశాక జరిగిన మ్యాచ్‌లో భారత జోడీ.. 21-12, 21-19తో మలేసియాకు చెందిన ఆరోన్ చియ సో వుయ్ యిక్ను ఓడించింది.
43 నిమిషాల పాటు జరిగిన పోరులో గేమ్ ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించిన సాత్విక్ ద్వయం.. నిరుడు పారిస్ వేదికగా ఇదే జంట చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నారు. సెమీస్ చేరడంతో సాత్విక్-చిరాగ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పతకాన్ని కూడా ఖాయం చేసుకున్నారు. 2022లో భారత జోడీ కాంస్యం గెలిచిన విషయం విదితమే.