బ్యాంకాక్: ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నమెంట్ స్టేజ్-1లో భారత ఆర్చర్లు సత్తాచాటారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీ రెండో రోజు మన ఆర్చర్లు రెండు కాంస్యాలు గెలుచుకోగా మరో నాలుగు ఈవెంట్లలో ఫైనల్‌కు చేరి పతకాలు ఖాయం చేసుకున్నారు. మహిళల కాంపౌండ్ టీమ్ సెమీస్ మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి తానిపర్తి చికిత, రాజ్ కౌర్, తేజల్ సాల్వెతో కూడిన త్రయం.. 229-226తో ఆతిథ్య థాయ్‌లాండ్‌పై ఉత్కంఠ పోరులో గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.
కానీ పురుషుల కాంపౌండ్ విభాగంలో రజత్, రిషభ్, ఉదయ్ త్రయం.. 233-234తో వియత్నాం చేతిలో పోరాడిఓడింది. కానీ కాంస్య పోరులో 234-232తో భూటాన్‌ను ఓడించి పతకం సాధించింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగాల్లో జాకర్, కంబోజ్ పసిడి పతక పోరుకు అర్హత సాధించగా చౌహాన్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ ఆడనున్నాడు. మహిళల రికర్వ్ టీమ్ (రుమా బిస్వాస్, కృతి, రిధి) 5-1తో మలేషియాను ఓడించి కాంస్యం నెగ్గింది.