గిరిజన అభివృద్ధికి బహుముఖ కృషి
భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ జాతీయ పతాకాన్ని ఆవిషరించి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేదర్ చిత్రపటాలకు నివాళులర్పించారు.
- విద్య, వైద్యం, ఉపాధి, సంసృతి పరిరక్షణకు ప్రాధాన్యం
- భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, ఆగస్టు 15: భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ జాతీయ పతాకాన్ని ఆవిషరించి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేదర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కుమ్రంభీమ్ వంటి త్యాగధనుల స్ఫూర్తితో గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక వసతులు, సాగు, తాగునీరు, స్వయం ఉపాధి తదితర రంగాల్లో ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి ఐటీడీఏ ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందన్నారు.
గిరిజన సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ఉత్తమ ఐటీడీఏగా భద్రాచలానికి జాతీయస్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమన్నారు. తెలుగు భాషతోపాటు కోయ భాష, సంసృతి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. విశిష్ట సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి ఉత్తమ ఉద్యోగులుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. గిరిజన యువతలో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో ముగ్గురు ప్రతిభావంతులకు మొత్తం రూ.1.10 లక్షల సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ ఆనంద్కుమార్, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ చందన, ఆర్సీవో అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

