మాడ్రిడ్: ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత ఆర్చర్లు పతక బోణీ కొట్టారు. తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. ఏకంగా మూడు విభాగాల్లో పతకాలు సాధించి సత్తాచాటింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో రజతం సాధించిన జ్యోతి.. కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌తో పాటు మిక్స్డ్ విభాగంలోనూ మెడల్స్ సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల కాంపౌండ్ ఇండివిడ్యూవల్ ఫైనల్లో జ్యోతి.. 147-148తో బ్రిటన్ ఆర్చర్ ఎల్లా గిబ్సన్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఇక కాంపౌండ్ ఈవెంట్ ఫైనల్లో జ్యోతి, పర్నీత్ కౌర్, ప్రతీక ప్రదీప్‌తో కూడిన భారత త్రయం.. 225-227తో చైనీస్ తైఫీ చేతిలో ఓడింది.
తొలి గేమ్‌లో ఇరు జట్లు తలా 57 పాయింట్లు సాధించగా.. రెండో గేమ్‌లో ప్రత్యర్థి కంటే భారత్ 2 పాయింట్లు ముందంజలోనే ఉంది. మూడో గేమ్‌లో తైఫీ ఆర్చర్లు భారత్ ఆధిక్యాన్ని ఒక పాయింట్‌కు తగ్గించగా కీలకమైన నాలుగో గేమ్‌లో జ్యోతి బృందం 55 పాయింట్లు స్కోరు చేయగా తైఫీ ఆటగాళ్లు 58 పాయింట్లతో స్వర్ణాన్ని ఎగురేసుకుపోయారు. ఇక ఇదే విభాగం మిక్స్డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పోరులో జ్యోతి, రిషభ్‌తో కూడిన భారత్.. 156-153తో ఎల్ సాల్వెడార్ను ఓడించి కాంస్యం గెలుచుకుంది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో సెమీస్ చేరిన పర్నీత్ కౌర్.. నాలుగో స్థానంలో నిలిచింది.