మాడ్రిడ్ (స్పెయిన్): ఈ ఏడాది గ్వాంగ్జు (కొరియా) వేదికగా జరగాల్సి ఉన్న ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో పతకాలు కొల్లగొట్టాలనే ప్రణాళికలో ఉన్న భారత ఆర్చర్లు.. అందుకు గాను మంగళవారం నుంచి మాడ్రిడ్ వేదికగా మొదలుకానున్న ప్రపంచకప్‌లో ఆఖరి స్టేజ్ (4)ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. జూలై 7 నుంచి 13 దాకా ఈ టోర్నీ జరుగనుండగా.. 49 దేశాల నుంచి సుమారు 300 మంది ఆర్చర్లు బరిలో ఉన్నారు.
కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో సీనియర్లు, జూనియర్లతో కలిసి భారత జట్టు సమతూకంగా ఉంది. కాంపౌండ్ కేటగిరీలో సీనియర్ ఆర్చర్లు అతాను దాస్, అభిషేక్ వర్మ, ఒజాస్, అదితి గోపీచంద్‌తో పాటు యువ ఆటగాైళ్లెన ఆనంద్‌రావ్, సోమనాథ్ షిండే, దీపికా కుమారి, అంకితా పోటీలో ఉన్నారు. రికర్వ్‌లో బొమ్మదేవర ధీరజ్, నీరజ్, తరుణ్దీప్తో పాటు రాహుల్ సింగ్ భారత పతక ఆశలు మోయనున్నాడు. రికర్వ్ మహిళల విభాగంలో తెలంగాణకు చెందిన తానిపర్తి చికిత, ఆంధ్ర అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, ప్రణీత్ కౌర్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.