బులవాయో: ప్రతిష్టాత్మక అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. మెగాటోర్నీలో ఓటమి ఎరుగని టీమ్ఇండియా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో సూపర్-6 పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. తద్వారా ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో తమకు ఎదురైన ఓటమికి పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని యువ భారత్ కసిమీద ఉంది. లీగ్ దశలో బంగ్లాదేశ్, అమెరికా, న్యూజిలాండ్‌పై గెలిచిన భారత్..సూపర్-6 తొలి పోరులో జింబాబ్వేను చిత్తుచేసింది. తద్వారా సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాక్‌పై గెలువడం ద్వారా ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ నాకౌట్‌కు అర్హత సాధించనుంది. వైభవ్ సూర్యవంశీ(166), అభిజ్ఞాన్ కుందు(183), విహాన్ మల్హోత్రా(151) మంచి ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసిరానుంది. అయితే ఓపెనర్ సమీర్ మిన్హాస్ మంచి ఫామ్‌లో ఉండటం పాక్‌కు అదనపు బలం కానుంది.
మ: 1 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో