దుబాయ్: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మరో హైఓల్టేజీ ఫైనల్ సమరానికి సిద్ధమయ్యాయి. ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా ఈ రెండు జట్లూ సెమీస్‌లో తమ ప్రత్యర్థులను చిత్తుచేసి టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. మొదటి సెమీస్‌లో భారత అండర్-19 జట్టు.. 8 వికెట్ల తేడాతో శ్రీలంక అండర్-19పై అలవోక విజయం సాధించింది
. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లంక 138/8కే పరిమితమైంది. ఛేదనను భారత జట్టు.. 18 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి పూర్తిచేసింది. ఆరోన్ జార్జి (58*), విహాన్ మల్హోత్ర (61*) అర్ధ శతకాలతో రాణించారు. మరో సెమీస్‌లో పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. 27 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లా 121 రన్స్‌కే కుప్పకూలింది. లక్ష్యాన్ని పాక్.. 16.3 ఓవర్లలో ఛేదించింది. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు జరుగుతుంది.