Kirti Azad : భారత జట్టు తొలి వరల్డ్ కప్ హీరో కీర్తీ ఆజాద్ (Kirti Azad ) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన భార్య పూనమ్ ఝా ఆజాద్ (Poonam Jha Azad ) కన్నుమూసింది. ఈ విషయాన్ని ఈ లెజెండరీ క్రికెటర్ ఎక్స్ వేదికగా అభిమానులకు తెలియజేశాడు. దాంతో, మాజీ ఆటగాళ్లు, పలువురు రాజకీయ ప్రముఖులు పూనమ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1983 వరల్డ్ కప్ హీరో అయిన కీర్తికి అప్పటి సహచరులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
‘నా భార్య పూనమ్ ఇకలేరు. ఆమె సోమవారం మధ్యాహ్నం 1240 గంటలకు మృతి చెందారు. ఆమె కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని ఆజాద్ వెల్లడించాడు. పూనమ్ మరణ వార్త తెలియగానే బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఎక్స్ వేదకగా సంతాపం తెలియజేశారు.
My wife, Poonam no more. Left for her heavenly aboard at 12:40 PM. Thank you all for your good wishes.
— Kirti Azad (@KirtiAzaad) September 2, 2024
ఆజాద్ దంపతులు
క్రికెట్కు వీడ్కోలు పలికాక కీర్తి ఆజాద్ రాజకీయాల్లో అడుగు పెట్టారు. భర్తతో కలిసి రాజకీయాల్లో రాణించిన పూనమ్ 2016లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని వీడారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం కీర్తి ఆజాద్ తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ తరఫున లోక్సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
Saddened to know that Poonam Jha Azad, wife of our MP & World Cup-winner cricketer Kirti Azad, has breathed her last.
I have known Poonam for a long time. I also knew that she was critically ill for the last few years. Kirti & other family members tried their best & were always…
— Mamata Banerjee (@MamataOfficial) September 2, 2024
కపిల్ దేవ్ సారథ్యంలో వన్డే వరల్డ్ కప్ గెలుపొందిన భారత జట్టులో సభ్యుడైన కీర్తి ఆజాద్.. ఆ తర్వాత ఆసియా కప్ తొలి సీజన్లోనూ చెలరేగాడు. కుడి చేతివాటం బ్యాటర్ అయిన ఆయన టీమిండియా తరఫున 7 టెస్టులు, 25 వన్డేలు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 135 పరుగులు, వన్డేల్లో 269 పరుగులతో రాణించాడు. భారత స్వాత్రంత్య పోరాటంలో పాల్గొన్న భగవత్ ఝా ఆజాద్ కుటుంబానికి చెందిన ఆజాద్ ఆ తర్వాత రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగాడు.