Kangana Ranaut | లైఫ్‌లో మనకంటూ ఒక పార్ట్నర్ ఉండాలి : కంగనా రనౌత్
Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency).
Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గతేడాది నవంబరు 24న విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వలన విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత కూడా ఈ సినిమా థియేటర్స్ వద్దకు వెళ్లలేదు. పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. చివరికి ఈ నెల 6న విడుదల చేయనున్నట్లు కంగనా ప్రకటించారు. ఇక విడుదలకు ఇంకా నాలుగు రోజులే ఉండడంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోటుంది కంగనా.
అయితే ప్రమోషన్స్‌లో భాగంగా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తనపై వస్తున్న నెగిటివ్ పబ్లిసిటీ కారణంగానే పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నట్లు కంగనా చెప్పారు. అయితే ఎవరిని చేసుకుంటారు రాజకీయ నాయకుడినా.. లేదా నటుడినా అన్న ప్రశ్నకు రిప్లయ్ ఇస్తూ.. ఎవరిని చేసుకోవాలి అని ఏం లేదు. మనసుకు నచ్చిన వాడై ఉండాలి. అలాగే పెళ్లిపై కూడా ఎలాంటి ద్వేషం లేదని.. మనకంటూ లైఫ్‌లో ఒక పార్ట్నర్ ఉండాలని తెలిపారు. అయితే నేను పెళ్లి చేసుకుందాం అంటే నాపై నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. అందుకే వివాహం చేసుకోలేకపోతున్నా. కోర్టులో కూడా నాపై కేసులు ఉన్నాయి. పెళ్లి అయిన అనంతరం కోర్టు కేసు అంటూ పోలీసులు ఇంటికి వస్తే మా అత్తమామలు భయపడి పారిపోతారు అంటూ కంగనా చెప్పుకోచ్చింది.
Also Read..
- Chiranjeevi | బాలకృష్ణతో చిరంజీవి ఫ్యాక్షన్ సినిమా.. ఇక అభిమానుల కల నెరవేరనుందా..?
- Supreme Court: రాజకీయ పార్టీలకు దూరంగా ఉండండి.. రైతులకు చెప్పిన సుప్రీంకోర్టు
- Helicopter | రష్యాలో మిస్సైన హెలికాప్టర్ కథ విషాదాంతం.. 22 మంది మృతదేహాలు స్వాధీనం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

