Helicopter | రష్యా (Russia)లో రెండు రోజుల క్రితం మిస్సైన హెలికాప్టర్ (Helicopter) కథ విషాదాంతమైంది. అందులో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను కూడా అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.
ఫార్ ఈస్ట్‌లో 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ గత శనివారం మిస్సైన విషయం తెలిసిందే. ఈ హెలికాప్టర్ క్రాష్ అయినట్లు రష్యా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో మృతి చెందిన 22 మంది మృతదేహాలను తాజాగా స్వాధీనం చేసుకున్నారు. ‘ఫార్ ఈస్ట్‌లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 22 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం’ అని రష్యా అత్యవసర విభాగం అధికారులు తెలిపారు.
గత శనివారం రష్యన్ ఫార్ ఈస్ట్‌లోని కమ్చట్కా ద్వీపకల్పంలో రష్యన్ Mi8 శ్రేణికి చెందిన హెలికాప్టర్ అదృశ్యమైంది. అందులో 19 మంది ప్రయాణికులు, ముగ్గరు సిబ్బంది ఉన్నారు. ద్వీపకల్పంలో పర్యాటక యాత్రలను నిర్వహించే విత్యాజ్ ఏరో ఎయిర్‌లైన్‌కు చెందిన ఈ హెలికాప్టర్ వచ్కాజెట్స్ అగ్నిపర్వతం (Vachkazhets volcano) సందర్శన సమయంలో అదృశ్యమైంది.
కమ్చట్కా ప్రాంతంలోని వాచ్ కాజెట్స్ నుంచి బయల్దేరిన ఈ హెలికాప్టర్.. షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానానికి చేరుకోలేదు. రంగంలోకి దిగిన అధికారులు హెలికాప్టర్ కోసం గాలింపు చేపట్టగా.. తర్వాత రోజు హెలికాప్టర్ శిథిలాలను గుర్తించారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో దృశ్యమానత కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
కాగా, ఎంఐ-8 శ్రేణికి చెందిన ఈ డబుల్ ఇంజిన్ హెలికాప్టర్‌ను 1960ల్లో రూపొందించారు. దీన్ని రష్యాతోపాటు చుట్టు పక్కల దేశాల్లో అత్యధికంగా వినియోగిస్తుంటారు. ఈ ఏడాది ఆగస్టులో కూడా కమ్చట్కాలో ఇటువంటి హెలికాప్టరే కూలిపోయింది. ఆ సమయంలో అందులో 16 మంది ప్రయాణికులు ఉన్నారు.
Also Read..
TG Rains | బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..! తెలంగాణలో మరో మూడురోజులు వానలే..!
Mahabubabad Floods | మహబూబాబాద్ జిల్లాను ముంచేసిన వరద… ఫోటోలు
Paralympics 2024 | బ్యాడ్మింటన్ ఫైనల్లో తులసీమథి.. పసిడితో చరిత్ర సృష్టించేనా..?