Paralympics 2024 | బ్యాడ్మింటన్ ఫైనల్లో తులసీమథి.. పసిడితో చరిత్ర సృష్టించేనా..?
Paralympics 2024 : పారిలింపిక్స్లో భారత షట్లర్ సంచలనం సృష్టించింది. బ్యాడ్మింటన్‌లో ఫైనల్ చేరిన తొలి ఇండియన్‌గా తులసీమథి మురుగేశన్ (Thulasimathi Murugesan) రికార్డు నెలకొల్పింది. పతకం కోసం ఆమె చైనాకు చెందిన యాంగ్ గ్జిక్జియాతో తలపడనుంది.
Paralympics 2024 : పారిలింపిక్స్లో భారత షట్లర్ సంచలనం సృష్టించింది. బ్యాడ్మింటన్‌లో ఫైనల్ చేరిన తొలి ఇండియన్‌గా తులసీమథి మురుగేశన్ (Thulasimathi Murugesan) రికార్డు నెలకొల్పింది. తద్వారా ఈ పారా బ్యాడ్మింటన్ స్టార్ స్వర్ణానికి అడుగు దూరంలో నిలిచింది. సోమవారం జరిగిన ఎస్‌యూ5 సెమీఫైనల్లో భారత్‌కే చెందిన మనీషా రామదాస్(Manisha Ramadasu)ను మురుగేశన్ ఓడించింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన పోరులో మురుగేశన్ అద్భుత విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. పసిడి పతకం కోసం ఆమె చైనాకు చెందిన యాంగ్ గ్జిక్జియాతో తలపడనుంది.
పారిస్ ఆతిథ్యమిస్తున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు తులసీమథి మురుగేషన్ మరో పతకం ఖాయం చేసింది. ఇండియాకే చెందిన మనీషా రామదాసుతో హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్లో 23-21, 21-17తో విజయం సాధించింది. తద్వారా పారాలింపిక్స్ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి భారత పారా షట్లర్‌గా రికార్డు సొంతం చేసుకుంది.
షూటర్లు భళా..
ఇప్పటివరకూ ఈ పోటీల్లో భారత్‌కు ఏడు పతకాలు వచ్చాయి. షూటింగ్లో అవని లేఖరా(Avani Lekhara) గోల్డ్ మెడల్‌తో బోణీ కొట్టగా.. మోనా అగర్వాల్, మనీశ్ నర్వాల్‌లు కాంస్యంతో మెరిశారు. అనంతరం 100 మీటర్ల రేసులో ప్రీతి పాల్ కంచు మోత మోగించింది. అంతేకాదు 200 మీటర్ల పోటీలోనూ ప్రీతి కాంస్యం కొల్లగొట్టింది. శనివారం జరిగిన 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో రుబీనా ఫ్రాన్సిస్ రజతంతో మెరిసింది.

ఇవి కూడా చదవండి
- Viajayawada Rains | వరదలో మునిగిపోయిన విజయ డెయిరీ.. 70 కోట్ల నష్టం!
- KTR | మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం చెల్లించాల్సిందే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కేటీఆర్
- DTC Workers | అనిశ్చితి, నిలకడ లేని ఆదాయం : డ్రైవర్ల దుర్భర పరిస్థితిపై రాహుల్ గాంధీ ఆవేదన
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

