Chiranjeevi | బాలకృష్ణతో చిరంజీవి ఫ్యాక్షన్ సినిమా.. ఇక అభిమానుల కల నెరవేరనుందా..?
Chiranjeevi | టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ (Chiranjeevi) తెలుగు సినీ పరిశ్రమలో 50 ఏండ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో సినీ స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారని తెలిసిందే. ఈవెంట్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బాలకృష్ణతో సినిమా చేయాలనుందని చేసిన కామెంట్స్ ఇప్పుడు మూవీ లవర్స్‌తోపాటు అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి.
Chiranjeevi | టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ (Chiranjeevi) తెలుగు సినీ పరిశ్రమలో 50 ఏండ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో సినీ స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారని తెలిసిందే. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ఈ వేడుకలకు టాలీవుడ్‌తోపాటు వివిధ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, బాలకృష్ణకు సెఫరేట్ ఫ్యాన్ బేస్ ఉందని తెలిసిందే.
ఈ ఇద్దరి సినిమాలు విడుదలవుతున్నాయంటే.. బాక్సాఫీస్ వద్ద క్రేజ్ ఎలా ఉండేదో మూవీ లవర్స్‌కు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఈవెంట్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బాలకృష్ణతో సినిమా చేయాలనుందని చేసిన కామెంట్స్ ఇప్పుడు మూవీ లవర్స్‌తోపాటు అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి.
ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. బాలయ్య 50 ఇయర్స్ జర్నీ సెలబ్రేషన్స్‌లో భాగం కావడం థ్రిల్లింగ్‌గా ఉంది. ఇది కేవలం బాలయ్యకు సంబంధించిన వేడుకలు మాత్రమే కాదు.. మొత్తం తెలుగు సినీ పరిశ్రమది. తెలుగు ప్రజలతో నందమూరి తారకరామారావు అనిర్వచనీయమైన అనుబంధం ఉంది. ఆయన వారసత్వాన్ని కొనసాగించడం అంత సులభమైన విషయమేం కాదు. ఐదు దశాబ్దాలుగా బాలకృష్ణ హీరోగా విజయవంతంగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఓ వైపు రాజకీయాలు, మరోవైపు హెల్త్‌కేర్ అమూల్యమైన సేవలందిస్తున్నారన్నాడు.
నేను ఇంద్రలో నటించేందుకు బాలకృష్ణ నటించిన సమర సింహారెడ్డి సినిమానే స్పూర్తి.. నాకు బాలయ్యతో కలిసి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా చేయాలనుంది అని చెప్పాడు చిరంజీవి. మా అభిమానులు ఒకరితోఒకరు గొడవ పడేవారు. నేను, బాలయ్యతోపాటు ఇతర హీరోలు మా ఆత్మీయ సంబంధాన్ని ప్రదర్శించడానికి అనేక కార్యక్రమాలలో పాల్గొనేవాళ్లం. ఆ తర్వాత మా అభిమానులు కూడా ఇతర హీరోల అభిమానులతో స్నేహం చేయడం మొదలుపెట్టారు. బాలకృష్ణ లేకుండా మా ఇంట్లో ఏ శుభకార్యాలు జరగవు. బాలకృష్ణకు భగవంతుడు జీవితాంతం అపరిమిత శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. బాలయ్య చిరకాలం జీవించాలని చెప్పుకొచ్చాడు చిరంజీవి.

చిరు చేసిన తాజా కామెంట్స్‌తో చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల కల నెరవేరబోతుందంటూ అప్పుడే ఇండస్ట్రీ సర్కిల్లో జోరుగా టాక్ వినిపిస్తోంది. ఒకవేళ సరైన కథ, డైరెక్టర్ దొరికి ఈ ఇద్దరు ఫ్యాక్షన్ సినిమా చేస్తే మాత్రం ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్స్ బద్దలవడం గ్యారంటీ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
Read Also :
Viswam | స్టైలిష్ లుక్‌లో గోపీచంద్.. విశ్వం టీజర్ రిలీజ్ టైం ఫిక్స్
Billa Ranga Baasha | కిచ్చా సుదీప్ బిల్లా రంగా భాషా.. హనుమాన్ మేకర్స్ అనౌన్స్మెంట్ అదిరిందంతే..!
Deepika Padukone | దీపికా పదుకొనే ఖాతాలో మరో ఖరీదైన విల్లా.. ఇంతకీ ఎక్కడో తెలుసా?
Kanguva | ఆ వార్తలే నిజమయ్యాయి.. కంగువ వాయిదాపై సూర్య క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

