Supreme Court: రాజకీయ పార్టీలకు దూరంగా ఉండండి.. రైతులకు చెప్పిన సుప్రీంకోర్టు
Supreme Court: నిరసన చేపడుతున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రాజకీయ పార్టీలకు రైతులు దూరంగా ఉండాలని సుప్రీం సూచించింది. శంభూ బోర్డర్ వద్ద నిరసన చేపడుతున్న రైతుల గురించి ఇవాళ సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది.
న్యూఢిల్లీ: పంజాబ్, హర్యానా మధ్య ఉన్న శంభూ సరిహద్దు వద్ద నిరసన చేపడుతున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) ఇవాళ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు జడ్జి జస్టిస్ నవాబ్ సింగ్ ఆ కమిటీకి నాయకత్వం వహించనున్నారు. జస్టిస్ సూర్య కాంత్, ఉజ్వల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ ఆ కేసును విచారించింది. వారంలోగా ఆ కమిటీ తొలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
రాజకీయ పార్టీలకు రైతులు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. శంభు సరిహద్దు వద్ద ఉన్న బారికేడ్లను దశల వారీగా తొలగించేందుకు సంబంధిత అధికారులు మీటింగ్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీం సూచించింది. ఢిల్లీలోకి ప్రవేశించేందుకు చూసిన పంజాబ్ రైతులను శంభూ బోర్డర్ వద్ద అడ్డుకున్న విషయం తెలిసిందే. అమలు కాని వాగ్దానాలను పట్టించుకోవద్దు అని కూడా రైతులకు సుప్రీం సూచించింది.
ప్రత్యాత్నాయ ప్రదేశాలకు తమ నిరసనలను మార్చుకోవచ్చు అని ఆందోళనకారులకు కోర్టు చెప్పింది. రైతుల ఆందోళనలను రాజకీయం చేయవద్దు అని జస్టిస్ కాంత్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

