AP Rains | ఏపీకి మళ్లీ వరుణ గండం.. ఈ నెల 5న మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్!
AP Rains | ఏపీని వరుణుడు ఇప్పుడే వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుండగా.. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
AP Rains | ఏపీని వరుణుడు ఇప్పుడే వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుండగా.. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడుతోంది. రానున్న 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తాలో మోస్తారు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్దమవుతోంది. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం, ఔషధాలు, తాగునీరు వంటివి అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రయల్ రన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారు. ట్రయల్ రన్ తర్వాత ఈ డ్రోన్లు దాదాపు 8 నుంచి 10 కిలోల వరకు ఆహారం, మెడిసిన్, తాగునీరు వంటివి తీసుకెళ్తాయనే అంచనాకు వచ్చినట్లు సమాచారం.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shiraz Mehdi | చిన్న సినిమాల హక్కుల కోసం యుద్ధం తప్పదు: హీరో షిరాజ్ మెహదీ
U-19 Asia Cup: ఆర్యావీర్ సెహ్వాగ్, లక్ష్య రాయిచందానీ హాఫ్ సెంచరీలు.. ఆసియా అండర్-19లో భారత్ బోణీ
Putta Madhukar | ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా కన్నీళ్లేనా? : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
AIADMK Leader Arrest | టీవీకే ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఎర.. ఏఐఏడీఎంకే నేత అరెస్ట్
మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీకృష్ణ మధ్య ముదురుతున్న వివాదం.. గాంధీభవన్‌కు చేరిన పంచాయితీ!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

