Viral Video : జంతు ప్రదర్శనశాలల్లోని (Zoo Parks) ఎన్క్లోజర్లలో ఉన్న జంతువులతో కొందరు సందర్శకులు అతి చేస్తుంటారు. పిచ్చిపిచ్చి పనులు చేస్తూ ఆయా జంతువుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంటారు. జూ నిబంధనలను (Rules) ఉల్లంఘిస్తూ జంతువులతో సెల్ఫీలు దిగుతుంటారు. వీడియోలు తీస్తుంటారు. జంతువులకు, సాటి సందర్శకులకు ఇబ్బందులు సృష్టిస్తారు.
ఇలా చేస్తూ సందర్శకులు జంతువుల ఆగ్రహానికి గురైన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొందరు అతిచేసి జంతువుల చేతిలో బలయ్యారు కూడా. ఇప్పుడు కూడా సందర్శకుల అత్యుత్సాహానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతున్నది. ఆ వీడియోలో సింహం చేసిన పని చూసి అందరూ షాకవుతున్నారు. @visualfeastwang అనే ట్విటర్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువకుడు సింహానికి ఏదో తినిపిస్తుండగా.. మరో యువకుడు ఎన్‌క్లోజర్‌లో చేయిపెట్టి తన మొబైల్‌తో వీడియో తీస్తున్నాడు. అయితే ఆ యువకుడు చేస్తున్న పని నచ్చలేదు అన్నట్టుగా సింహం అతడి చేతిని బయటికి నెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. రూల్స్‌ను అతిక్రమించి వీడియో తీయడం తప్పు అన్నట్టుగా సింహం ప్రవర్తించింది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోను కొన్ని గంటల్లోనే 20 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
v
A Lion’s Response to Rule- Breaking pic.twitter.com/b5kuFZncQ8
— Visual feast (@visualfeastwang) August 31, 2024