IND vs SA 4th T20 : భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న పొట్టి సిరీస్‌లో కీలకమైన నాలుగో టీ20 మరికాసేపట్లో మొదలుకానుంది. జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ఇరుజట్లు ట్రోఫీ కోసం నున్వా నేనా అన్నట్టు తలపడనున్నాయి. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ పోరులో టాస్ గెలచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ తీసుకున్నాడు.
అయితే.. గత మ్యాచ్‌లో ఆడిన 11 మందితోనే ఆడుతున్నామని సూర్య చెప్పాడు. దాంతో, అరంగేట్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఐపీఎల్ సంచలనం యశ్ దయాల్‌కు నిరాశ తప్పలేదు. మరోవైపు ఆతిథ్య దక్షిణాఫ్రికా సైతం ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.
It’s final T20I time and the series is on the line 🍿
🔗 https://t.co/WQCWljqsgi | #SAvIND pic.twitter.com/i5MxFnpADR
— ESPNcricinfo (@ESPNcricinfo) November 15, 2024
భారత జట్టు : సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా జట్టు : రియాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఎడెన్ మర్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ, అండిలే సిమెలానే, కేశవ్ మహరాజ్, లుతో సిపమ్లా.