కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల హాకీ టెస్టు సిరీస్‌ను భారత జట్టు 2-0తో గెలుచుకుంది. బుధవారం రాత్రి జరిగిన మూడో టెస్టులో భారత్ 4-1తో ఆతిథ్య జట్టును ఓడించింది. తొలి టెస్టులోనూ భారత్ నెగ్గగా రెండో టెస్టు డ్రాగా ముగిసింది.
వెల్లింగ్టన్: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో తడబాటుకు గురైనా కీలకమైన ఆధిక్యాన్ని దక్కించుకుంది. రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఆ జట్టు.. 74.4 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌట్ అయిం ది. మిచెల్ హే (61), డెవాన్ కాన్వే (60) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టుకు 73 రన్స్ ఆధిక్యం దక్కింది.