INDvAFG: ఆఫ్ఘనిస్తాన్‌ను దెబ్బతీసిన ఇండియన్ స్పిన్నర్లు.. ఇన్నింగ్స్ 300 రన్స్ తేడాతో భారీ విజయం
INDvAFG: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇండియా ఇన్నింగ్స్ 300 రన్స్ తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 112 రన్స్‌కే ఆఫ్ఘనిస్తాన్ ఆలౌటైంది. భారత స్పిన్నర్ సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసుకోగా, రెండో ఇన్నింగ్స్‌లో సుందర్ 4, కుల్దీప్ 3 వికెట్లు తీసుకున్నారు.
న్యూ చండీఘడ్: భారత్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడింది. న్యూ చండీఘడ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 300 రన్స్ తేడాతో భారత్ భారీ విక్టరీ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ కేవలం 112 పరుగులకే ఆలౌటైంది. ఇవాళ మూడవ రోజు 14 వికెట్లు పడ్డాయి. ఇండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 564 రన్స్ చేయగా, ఆఫ్ఘనిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 152 రన్స్‌కు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్ మానవ్ సుతార్ ఆరు వికెట్లు తీసి ఆఫ్ఘన్ బ్యాటర్లను దెబ్బతీశాడు.
అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్ ఆడిన ఆఫ్ఘనీలు మరీ దారుణంగా చేతులెత్తేశారు. టాపార్డర్ బ్యాటర్ల దాదాపు విఫలం అయ్యారు. ఓపెనర్ అటల్ 42, గుర్బాజ్ 24 రన్స్ చేశారు. 412 పరుగులు వెనకబడి ఫాలోఆన్ ఆడిన ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ కూడా నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత స్పిన్నర్లు సత్తా చాటారు. ఆఫ్ఘనిస్తాన్ కేవలం 35.3 ఓవర్లలో తన రెండో ఇన్నింగ్స్‌లో 112 రన్స్ చేసి ఆలౌటైంది.
మూడో రోజు వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించారు. రెండో ఇన్నింగ్స్‌లో సుందర్ 4, కుల్దీప్ మూడు వికెట్లు తీసుకున్నారు.
Leaving New Chandigarh with a massive win under the belt 🇮🇳
A complete team performance from #TeamIndia 🤍
Scorecard ▶️ https://t.co/Au50EfVM30#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/MxUFJHvoq4
— BCCI (@BCCI) June 8, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

