ఓవల్ : తీవ్ర ఉత్కంఠ రేపిన ఓవల్ టెస్టులో గిల్ సేన.. ఆరు పరుగుల తేడాతో ఇండ్లండ్పై విజయం సాధించింది. హైదరాబాదీ స్టార్ బౌలర్ సిరాజ్ .. ఆఖరి రోజు నిప్పులు చెరిగాడు. అయిదో టెస్టులో విజయం సాధించడంతో.. సిరీస్ 2-2 తేడాతో సమమైంది. రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ అయిదు వికెట్లు తీసి ఇండియన్ విక్టరీలో కీలక పాత్ర పోషించాడు.
It’s all over at the Oval 🤩
FIFER for Mohd. Siraj 🔥🔥
Scorecard ▶️ https://t.co/Tc2xpWNayE
#TeamIndia | #ENGvIND pic.twitter.com/ffnoILtyiM
— BCCI (@BCCI) August 4, 2025
చివరి రోజు కేవలం 34 రన్స్ టార్గెట్‌తో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. ఇండియా గెలవాలంటే మరో నాలుగు వికెట్లు తీయాల్సి ఉంది. అయితే ప్రతి బంతి తీవ్ర టెన్షన్‌గా సాగింది. సిరాజ్ తన స్పీడ్‌తో ఇండ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. చివరి రోజు జేమీ స్మిత్, ఓవర్టన్, అట్కిన్సన్ వికెట్లను సిరాజ్ తీశాడు. అయిదో రోజు తొలి సెషన్లో 28 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లను ఇంగ్లండ్ కోల్పోయింది.
TAKE A BOW, MOHD. SIRAJ!
Scorecard ▶️ https://t.co/Tc2xpWMCJ6#TeamIndia | #ENGvIND pic.twitter.com/opZZ53Xnxh
— BCCI (@BCCI) August 4, 2025
గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ డ్రా అయ్యింది. ఈ సిరీస్‌లో శుభమన్ తన ట్యాలెంట్ చూపించాడు. బ్యాట్‌తో 700 పైగా రన్స్ చేశాడు. ఓవల్ టెస్టు చివరి రోజు కూడా ప్రతి వికెట్ కోసం బౌలర్లతో గిల్ చర్చించిన తీరు అతని సారథ్యాన్ని నిరూపించింది.గాయపడ్డ క్రిస్ వోక్స్ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేశాడు. చివరి వికెట్ రూపంలో అతను మైదానంలోకి వచ్చాడు. ఎడమ భుజానికి గాయమైనా.. ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ట్రై చేశాడు. అయితే అతను ఒక్క బంతిని కూడా ఎదుర్కోలేదు.
స్కోరు బోర్డు
ఇండియా 224 & 396
ఇంగ్లండ్ 247 & 367