IND vs SA : నిరుడు టీ20 ప్రపంచ కప్ నుంచి భారత జట్టు అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తోంది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో సిరీస్ పట్టేసిన టీమిండియా ఈసారి 30 పరుగులతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. శుక్రవారం అహ్మదాబాద్‌లో హార్దిక్ పాండ్యా(63), తిలక్ వర్మ(73)లు మెరుపు హాఫ్ సెంచరీలతో భారీ స్కోర్ అందించగా.. బంతితో వరుణ్ చక్రవర్తి(4-53), బుమ్రా(2-17)లు రెచ్చిపోయారు. అంతే.. ఒత్తిడికి లోనైన సఫారీ టీమ్ ఓటమిపాలైంది. టెస్ట్ సిరీస్ కోల్పోయినా వన్డే, పొట్టి ట్రోఫీలు హస్తగతం చేసుకొని ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది భారత్.
పొట్టి సిరీస్‌లో ప్రత్యర్థి ఎవరైనా విజయం మాదే అన్నట్టుగా భారత్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే వరుసగా 6 ట్రోఫీలు గెలుచుకున్న టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాను ఓడించి సిరీస్ పట్టేసింది. టీమిండియా నిర్దేశించిన 232 పరుగుల భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(65) సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. దాంతో.. స్కోర్ బోర్డు పరుగులు తీసింది. డికాక్ విధ్వంసంతో పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 67 రన్స్ చేసింది. తర్వాత బంతి అందుకున్న వరుణ్ చక్రవర్తి మొదటి ఓవర్లోనే రీజా హెండ్రిక్స్(13)ను ఔట్ చేసి బ్రేకిచ్చాడు.
It’s Jasprit Bumrah again 🤷♂️
A fantastic review by #TeamIndia 👏
South Africa 8 down now!
Updates ▶️ https://t.co/kw4LKLNSl3#INDvSA | @Jaspritbumrah93 | @surya_14kumar | @IDFCFIRSTBank pic.twitter.com/rqhqXH2u8y
— BCCI (@BCCI) December 19, 2025
డెవాల్డ్ బ్రెవిస్(31) జతగా దంచేస్తున్న డికాక్‌ను బుమ్రా రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. 13వ ఓవర్లో చక్రవర్తి వరుస బంతుల్లో ఎడెన్ మర్క్రమ్(6)ను ఎల్బీగా.. డొనొవాన్ ఫెరీరా(0)ను బౌల్డ్ చేసి మ్యాచ్‌ను టీమిండియావైపు తిప్పాడు. ఆ తర్వాత పాండ్యా ఓవర్లో 6, 4 బాదిన డేవిడ్ మిల్లర్(18)ను అర్ష్‌దీప్ బోల్తా కొట్టించాడు. చివరి ఓవర్లో లిండే(16)ను ఔట్ చేసి సఫారీలను ఒత్తిడిలో పడేశాడు. కానీ, మార్కో యాన్సన్(14) వరుసగా రెండు సిక్సర్లతో స్కోర్ 170 దాటింది. బుమ్రా ఓవర్లో రివ్యూతో యాన్సెన్ వెనుదిరగగా పర్యాటక జట్టు ఓటమి ఖాయమైంది.
టీ20 వరల్డ్‌కప్ సన్నాహక సిరీస్‌తో పునరాగమనం చేసిన హార్దిక్ పాండ్యా(63: 25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అహ్మదాబాద్‌లో చితక్కొట్టాడు. తన పవర్ హిట్టింగ్తో దక్షిణాఫ్రికా బౌలర్లను బెంబేలెత్తించిన పాండ్యా జట్టుకు భారీ స్కోర్ అందించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు సంజూ శాంసన్(37), అభిషేక్ శర్మ(34)లు శుభారంభమివ్వగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(5) ఎప్పటిలానే విఫలమయ్యాడు. సూర్య ఔటయ్యే సరికి స్కోర్ 115-3. ఆ దశలో క్రీజులోకి వచ్చిన పాండ్యా ఆలస్యం చేయకుండా ఉతుకుడే పనిగా పెట్టుకున్నాడు. లిండే, కార్బిన్ బాష్ ఓవర్లలో బౌండరీలతో రెచ్చిపోయిన అందుకున్నాడు.

ఆ తర్వాత కూడా తనదైన విధ్వంసక ఆటతో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. పాండ్యాకు జతగా తిలక్ వర్మ(73: 42 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్) స్వీప్ షాట్లతో హోరెత్తించి అర్ధ శతకం బాదాడు. వీరిద్దరూ పోటీపడుతూ బౌండరీలు బాదేయగా సఫారీ బౌలర్లు నీరుగారిపోయారు. పాండ్యా, తిలక్ మెరుపులతలో 17 ఓవర్లకే స్కోర్ 200 దాటింది. చివరి మూడు ఓవర్లలో 31 రన్స్ రాగా.. సఫారీలకు 232 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా.