Olympics 2028 : మహిళల పొట్టి ప్రపంచకప్- 2026 నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించిన భారత జట్టు(Team India)కు ఓ తీపికబురు. మెగా టోర్నీలో సెమీస్ చేరలేకపోయిన టీమిండియా 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. లాస్ ఏంజెల్స్‌లో జరుగునున్న విశ్వ క్రీడల్లో భారత్ బెర్తు దక్కించుకుందని సోమవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి వెల్లడించింది. ఆసియా జట్లలో ఒకటైన భారత్ టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక పాయింట్లతో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిందని ఐసీసీ తెలిపింది.
ఒలింపిక్స్‌లో క్రికెట్ అనే పదం వినిపించి వందల ఏళ్లు గడిచిపోయాయి. 128 ఏళ్ల విరామం తర్వాత లాస్ఏంజెల్స్లో మళ్లీ క్రికెట్ పోటీలకు తెరలేవనుంది. మెగా టోర్నీకి మరో రెండేళ్లే ఉండడంలో జట్ల ఎంపికపై దృష్టి సారించింది ఐసీసీ. ఈ క్రమంలోనే ఒక్కో ఖండం నుంచి ఒక్కో జట్టును విశ్వ క్రీడలకు తీసుకుంటోంది. మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో సెమీస్ బెర్తు చేజార్చుకున్నప్పటికీ.. ఆసియా నుంచి అత్యధిక పాయింట్లతో భారత జట్టు ఎంపికైంది.
🚨 BREAKING 🚨
The ICC has confirmed that Australia, Great Britain (represented by England), India, and South Africa have qualified for the women’s cricket competition at the 2028 Olympics. 🥇
They secured qualification as the highest-ranked eligible teams from Oceania, Europe,… pic.twitter.com/xAmZ1Koj6X
— Sportskeeda (@Sportskeeda) June 29, 2026
ఆసియా ఖండం నుంచి టీమిండియా క్వాలిఫై కాగా.. ఓసియన్ నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండం నుంచి దక్షిణాఫ్రికా, యూరప్ నుంచి ఇంగ్లండ్ ఒలింపిక్స్ బెర్తు సొంతం చేసుకున్నాయి. తద్వారా లాస్ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మొదటి నాలుగు మహిళల జట్లుగా నిలిచాయి. 2028 విశ్వక్రీడలకు ఆతిథ్యమిస్తున్న అమెరికా ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఐదో జట్టుగా ఎంపికయ్యే అవకాశముంది.
🚨 BREAKING
🏅 Six teams will compete in both the Men’s and Women’s T20 cricket events at the LA28 Olympic Games.
✅ Women’s teams qualified so far:
🇦🇺 Australia
🇬🇧 Great Britain
🇮🇳 India
🇿🇦 South Africa⏳ The remaining qualification spots will be decided through the newly… pic.twitter.com/36fOWO9W20
— CricTracker (@Cricketracker) June 29, 2026
షరతు ఏంటంటే.. ఈ ఏడాది జూన్ 30 నుంచి డిసెంబర్ 31 మధ్య యూఎస్ఏ టాప్-15లో ఉండాలి. ఒకవేళ అమెరికా విఫలమైతే.. 2027 మార్చి 1 నాటికి ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో ఉండని జట్టు.. ఐదో స్థానం దక్కించుకుంది. చివరి బెర్తును ఐసీసీ ఒలింపిక్ క్వాలిఫయర్ 2027 ద్వారా నిర్ణయించనున్నారు.