చియాంగ్ మాయి: ప్రతిష్టాత్మక మహిళల ఏఎఫ్సీ ఏషియన్ కప్‌లో భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. మంగళవారం 700వ వార్షికోత్సవం జరుపుకున్న చారిత్రక చియాంగ్ మాయి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 13-0 తేడాతో ఆతిథ్య మంగోలియాపై రికార్డు విజయం సాధించింది. ఆది నుంచే తమదైన జోరు కనబరిచిన భారత అమ్మాయిలు.. మంగోలియాను చిత్తుగా ఓడించారు.
మ్యాచ్ మొదలైనప్పటి నుంచి బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకున్న టీమ్ఇండియా.. మంగోలియా డిఫెన్స్‌ను కకావికలు చేసింది. యువ ైస్టెకర్ ప్యారీ ఐదు గోల్స్‌తో భారత భారీ విజయంలో కీలకమైంది. తెలంగాణకు చెందిన గుగులోతు సౌమ్య రెండు గోల్స్ చేయడంతో పాటు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ప్రియదర్శిని మరో రెండు గోల్స్ చేయగా, సంగీత, రింపా హల్దార్, మాళవిక, గ్రేస్ దాంగ్మయి ఒక్కో గోల్ చేశారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 29న తిమోర్ లెస్టెతో తలపడుతుంది.