హైదరాబాద్, ఆట ప్రతినిధి: అమ్మాయిల క్రికెట్కు అద్భుత భవిష్యత్తు ఉందని టీమ్ఇండియా మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అండర్-19 ప్రపంచకప్లో భారత్ విజేతగా నిలువడం ద్వారా దేశంలో అమ్మాయిల క్రికెట్కు మరింత ఆదరణ పెరిగిందని అన్నాడు. రవిశాస్త్రి సహ యజమానిగా ఉన్న కోచింగ్ బియాండ్ అకాడమీ బుధవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. ప్రతిభ కల్గిన యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు అకాడమీ..హిందూస్థాన్ యునీ లీవర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.
తెలంగాణ, ఆంధప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాల్లో మెరికల్లాంటి క్రికెటర్లను గుర్తించి మెరుగైన శిక్షణ ఇవ్వడంతో పాటు స్కాలర్షిప్ అందించే లక్ష్యంతో ముందుకెళుతున్నది. ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సభ్యురాలైన త్రిషను రవిశాస్త్రి సన్మానించాడు. ఈ కార్యక్రమంలో భరత్ అరుణ్, ఆర్ శ్రీధర్ పాల్గొన్నారు.