ఈస్ట్ లండన్ (దక్షిణాఫ్రికా): అరంగేట్ర ఆల్‌రౌండర్ అమన్జ్యోత్కౌర్ (30 బం తుల్లో 41 నాటౌట్; 7 ఫోర్లు) సత్తాచాటడం తో దక్షిణాఫ్రికాతో గు రువారం రాత్రి జరిగిన టీ20లో భారత్ విజయం సాధించింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో టీమ్ఇండియా 27 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అమన్‌జ్యోత్‌తో పాటు యష్తిక భాటియా (35), దీప్తి శర్మ (33) రాణించారు.
అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా మహిళల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. దీప్తి శర్మ (3/30), దేవిక వైద్య (2/19) ధాటికి దక్షిణాఫ్రికా ప్లేయర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అమన్జ్యోత్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. టోర్నీలో భాగంగా సోమవారం వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది.