నేవీ ముంబై: వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా 49 పరుగుల తేడాతో విండీస్‌పై భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 195/4 స్కోరు చేసింది. రోడ్రిగ్స్ (35 బంతుల్లో 73, 9ఫోర్లు, 2సిక్స్‌లు), మందన(33 బంతుల్లో 54, 7ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. 50 పరుగులకు ఓపెనర్ ఉమా ఛెత్రీ (24) వికెట్ కోల్పోయిన టీమ్ఇండియాను మందన, రోడ్రిగ్స్ ఆదుకున్నారు.
రోడ్రిగ్స్ తన ఇన్నింగ్స్‌లో 9ఫోర్లు, రెండు భారీ సిక్స్‌లతో చెలరేగింది. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కరిష్మా (2/18) రెండు వికెట్లు తీసింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన విండీస్ 20 ఓవర్లలో 146/7 స్కోరుకు పరిమితమైంది. టిటాస్ సాధు (3/37), దీప్తి (2/21), రాధాయాదవ్ (2/28) విండీస్ పతనంలో కీలకమయ్యారు.