శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Jan 28, 2020 , 02:41:17

కంగారూలను కొడితేనే

 కంగారూలను కొడితేనే

పోచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో అండర్‌-19 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన యువ భారత జట్టు.. మంగళవారం క్వార్టర్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. టైటిల్‌ నిలబెట్టుకునేందుకు మూడడుగుల దూరంలో ఉన్న ప్రియం గార్గ్‌ సేన.. కంగారూలను చిత్తుచేసి జూనియర్‌ లెవల్లో తమకు తిరుగులేదని చాటేందుకు రెడీ అయింది. మన కుర్రాళ్లు లీగ్‌ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి నాకౌట్‌కు చేరితే.. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో భంగపడ్డ ఆసీస్‌ ఆ తర్వాత రెండు మ్యాచ్‌లు గెలిచి భారత్‌తో అమీతుమీకి సిద్ధమైంది. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్‌, దివ్యాన్ష్‌ సక్సేనా, తిలక్‌ వర్మ, ప్రియం గార్గ్‌, ధృవ్‌ జురేల్‌, సిద్ధేశ్‌ వీర్‌ జోరు మీదుంటే.. బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌, ఆదిత్య అంకొలేకర్‌ విజృంభిస్తున్నారు. కార్తీక్‌ త్యాగి, ఆకాశ్‌ సింగ్‌ కూడా సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మెకంజీ హర్వే నాయకత్వంలోని ఆసీస్‌ జట్టు కూడా నాణ్యమైన ఆటగాళ్లతో నిండి ఉండటంతో ఈ మ్యాచ్‌లో హోరాహోరీ తప్పకపోవచ్చు. logo