న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక సుదిర్మన్ కప్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. తొలి టీమ్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ చేతిలో పరాజయం పాలైన భారత్.. సోమవారం మలేషియా చేతిలోనూ ఓడింది. దీంతో గ్రూప్-సిలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన మన జట్టు నాకౌట్ పోటీ నుంచి వైదొలిగింది.
స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సహా అంతా విఫలమవడంతో భారత్ 0-5తో మలేషియా చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట, మహిళల డబుల్స్‌లో గ్రాయత్రి గోపీచంద్-త్రిసా జాలి ద్వయం, మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-ధ్రువ్ జోడీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి.