కేప్‌టౌన్: ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమ్ఇండియా చివరి మ్యాచ్‌లోనైనా గెలువాలని భావిస్తున్నది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన భారత్.. ఆదివారం దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో తలపడనుంది. బ్యాటింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై టీమ్ఇండియా లైనప్ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఓటమి పాలైన రాహుల్ సేన.. ఆఖరి మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని చూస్తున్నది. క్లీన్‌స్వీప్ ప్రమాదం పొంచి ఉన్న తరుణంలో భారత జట్టు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. రెండు మ్యాచ్‌ల్లో కలిసి 7 వికెట్లు మాత్రమే పడగొట్టిన భారత బౌలర్లు ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తుంటే.. ఇదే జోరులో ప్రత్యర్థిని వైట్ వాష్ చేయాలని సఫారీలు కృతనిశ్చయంతో ఉన్నారు.