Ishan Kishan : న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచులో భారత్ భారీ స్కోరు సాధించింది. ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీ, సూర్య కుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్‌తోపాటు భారత బ్యాటర్లు రాణించడంతో ఇండియా భారీ స్కోరు నమోదు చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి, 271 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ముందు 272 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది.
టీ20లలో ఇండియాకు ఇది మూడో అత్యధిక స్కోరు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు బ్యాటర్లు అద్భుతమైన ఆటను అందించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 16 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. అయితే, సంజూ శాంసన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 43 బంతుల్లోనే 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేటు 239.
హార్థిక్ పాండ్యా 17 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన రింకూ సింగ్ 8 బంతుల్లో 8 పరుగులు, శివం దూబే 2 బంతుల్లో 7 పరుగులు చేయడంతో ఇండియా 271 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 1.1 ఓవర్లలోనే 23 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది.