తిరువనంతపురం: పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ కోసం మెరుగైన సన్నాహకాలు చేసుకుంటున్న టీమ్ఇండియాకు వరుణుడు నీడలా వెంటాడుతున్నాడు. ఇంగ్లండ్‌తో తొలి వార్మప్ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడటంతో టాస్ పడ్డ తర్వాత మ్యాచ్ రద్దు కాగా.. మంగళవారం నెదర్లాండ్స్‌తో జరగాల్సిన పోరు ఒక్క బంతి పడకుండానే రైద్దెంది.
దీంతో టీమ్ఇండియా సుదీర్ఘ ప్రయాణం చేసి మరోసారి వర్షాన్ని ఆస్వాదించాల్సి వచ్చింది. మిగిలిన జట్ల ప్రాక్టీస్ మ్యాచ్‌లకు సైతం వరుణుడు అడ్డుపడ్డా.. రోహిత్ సేన మాత్రం రెండు మ్యాచ్‌ల్లో కలిపి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్, బ్యాటింగ్ చేయలేదు. ఇక గురువారం నుంచి వన్డే ప్రపంచకప్‌నకు తెరలేవనుండగా.. టీమ్ఇండియా తమ తొలిపోరులో ఆదివారం ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.