రాజ్‌కోట్: ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌పై భారత మహిళల జట్టు కన్నేసింది. ఆదివారం ఇరు జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా మరో మ్యాచ్ మిగిలుడంగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. సీనియర్ల గైర్హాజరీలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ ప్రతీకా రావల్, తేజల్ హసబ్నిస్ అదరగొడుతున్నారు.
అరంగేట్రంలోనే సత్తాచాటుతూ భవిష్యత్‌పై ఆశలు రేపుతున్నారు. రెండో వన్డేలోనూ ఇదే సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ ఐర్లాండ్‌ను ఓడించేందుకు టీమ్ఇండియా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నది. మరోవైపు కనీసం పోటీనిచ్చేందుకు ఐర్లాండ్ తహతహలాడుతున్నది.