బ్రిస్టల్: టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లాడినా గెలుపు రుచి చూడని భారత టీ20 జట్టు.. మంగళవారం మరో కఠిన సవాల్‌కు సిద్ధమైంది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లను ప్రత్యర్థికి సమర్పించుకున్న టీమిండియా.. బ్రిస్టల్‌లో ఆతిథ్య జట్టుతో నాలుగో మ్యాచ్ ఆడనుంది. ఈ పోరులోనూ ఓడితే ఐర్లాండ్‌తో పాటు ఈ సిరీస్‌నూ కోల్పోయే ప్రమాదం పొంచిఉన్న నేపథ్యంలో మెన్ ఇన్ బ్లూ తీవ్ర ఒత్తిడితో ఉంది. యూకే పర్యటనకు వెళ్లి సుమారు రెండు వారాలు దాటినా ఇంకా అక్కడి పరిస్థితులకు తగ్గట్టు ఆడటంలో భారత క్రికెటర్లు దారుణంగా విఫలమవుతున్నారు. సెలక్షన్ తిప్పలు, బ్యాటర్ల పేలవ ప్రదర్శన, బౌలర్లలో అనుభవరాహిత్యం.. వెరసి కొత్తగా సారథ్య పగ్గాలు అందుకున్న శ్రేయస్ అయ్యర్‌కు ఇంకా జాతీయ జట్టు కెప్టెన్‌గా విజయం అందని ద్రాక్షే అవుతున్నది. ఈ నేపథ్యంలో సిరీస్‌ను కాపాడుకునేందుకు అయ్యర్ సేనకు చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితి ఎదురైంది. మరి సిరీస్‌కు కీలకమైన ఈ మ్యాచ్‌లో అయ్యర్‌సేన ఏం చేస్తుందన్నది ఆసక్తికరం.