India Vs England | నాటింగ్‌హామ్: ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌కు మూడో రోజు కూడా వర్షం ఆటంకం కలిగించింది. వర్షం కారణంగా మూడో రోజు ఆట అర్థంతరంగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు టీమిండియా ఆలౌట్ కావడంతో.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ 11.1 ఓవర్లలో 25జ0 పరుగులు చేసింది. అదే సమయంలో వర్షం అంతరాయం కలిగించింది. మూడో రోజు ఆట కష్టంగా మారడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. మూడో రోజు ఆట నిలిపివేసే సమయానికి క్రీజులో రోరీ బర్న్స్ (11 పరుగులు ), డొమెనిక్ సిబ్లీ (9 పరుగులు) ఉన్నారు. ప్రస్తుతానికి టీమిండియా 70 పరుగుల ఆధిక్యంలో ఉంది.