దుబాయ్: భారత్ వర్సెస్ పాకిస్థాన్(India Vs Pakistan) అంటేనే హైవోల్టేజ్ సమరం. అయితే ఇక నుంచి ఆ రెండు దేశాలు తటస్థ వేదికలపై పోరాడనున్నాయి. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఐసీసీ లైన్ క్లియర్ చేసింది. ఇక నుంచి పాకిస్థాన్, ఇండియా మధ్య జరిగే వన్డే మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. 2024 నుంచి 2027 మధ్య ఐసీసీ నిర్వహించే అన్ని టోర్నీల్లో.. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికలపై జరుగుతాయని ఐసీసీ తన స్టేట్మెంట్లో పేర్కొన్నది. అయితే 2028లో పాకిస్థాన్‌లో జరిగే మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు కూడా ఈ నిబంధన వర్తించనున్నది.
JUST IN: ICC issues update on Champions Trophy 2025 venue.
Details 👇https://t.co/aWEFiF5qeS
— ICC (@ICC) December 19, 2024
ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ఇండియా మ్యాచ్‌లన్నీ యూఏఈలో జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజా ఒప్పందం ప్రకారం.. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే మహిళల ప్రపంచ కప్, 2026లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌లోని భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లు తటస్థ వేదికల్లో జరగనున్నాయి. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను త్వరలో రిలీజ్ చేయనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.
2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ గెలుచుకున్నది. దాన్ని ఇప్పుడు ఆ దేశం డిఫెండ్ చేసుకోనున్నది. ఆ టోర్నీలో 8 దేశాలు ఆడనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ ఉన్నాయి.