పారిస్ : ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్ తర్వాతి ఎడిషన్ (2026)కు భారత్ ఆతిథ్యమివ్వనున్నది. ఈ మేరకు సోమవారం బీడబ్ల్యూఎఫ్.. పారిస్‌లో జరిగిన 2025వ ఎడిషన్ ముగింపు వేడుకల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. 2026 టోర్నీని ఢిల్లీలో నిర్వహించనున్నారు. బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు ఖున్యింగ్ పటమ, చీఫ్ ఆఫ్ ది ఫెడరేషన్ ఫ్రాంచైజీ డి బ్యాడ్మింటన్ ఫ్రాంక్ లారెంట్.. తదుపరి ఎడిషన్‌కు సంబంధించిన వివరాలను బ్యాడ్మి ంటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) జనరల్ సెక్రటరీ సంజయ్ మిశ్రాకు అందజేశారు.
కాగా భారత్‌లో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ జరుగనుండటం 17 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి. 2009లో నిర్వహించిన టోర్నీకి హైదరాబాద్ వేదికైంది. ఆసియాలోనూ 2018 (చైనాలోని నన్జింగ్) తర్వాత ఈ టోర్నీని నిర్వహించనుండటం ఇదే ప్రథమం.