T20 World Cup 2026 : క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పురుషుల పొట్టి ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటికే ఇరుదేశాల్లో వేదికలు ఖరారు చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మంగళవారం మ్యాచ్ వివరాలను వెల్లడించింది. ఫిబ్రవరి 7 నుంచి టోర్నీ షురూ కానుండగా.. అదే రోజు రాత్రి 7 గంటలకు ముంబైలో భారత్, అమెరికా తలపడనున్నాయి.
పొట్టి ప్రపంచకప్ తొలిపోరు కో-హోస్ట్ శ్రీలంకలోని కొలంబోలో జరుగనుంది. ఆరంభ మ్యాచ్లో పాకిస్థాన్, నెదర్లాండ్స్ ఢీకొంటాయి. ఆరోజు సాయంత్రం 7 గంటలకు డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ముంబై వేదికగా పసికూన అమెరికాతో తలపడనుంది. సెమఫైనల్స్కు ముంబై, కోల్కతా వేదిక కానున్నాయి. అహ్మదాబాద్లో మార్చి 8న ఫైనల్ నిర్వహిస్తారు. దాయాదులు టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15 శ్రీలంకలో జరుగునుంది. ఒకవేళ పాక్ ఫైనల్ చేరితే అహ్మదాబాద్ బదులు కొలంబోలోనే టైటిల్ పోరు నిర్వహిస్తారు.
Venues for the ICC Men’s #T20WorldCup 2026 have been locked in 🏟️ pic.twitter.com/PIYTvzRWly
— ICC (@ICC) November 25, 2025
ప్రపంచకప్ పోటీలకు అర్హత సాధించిన 20 జట్లను గ్రూప్లుగా విభించింది ఐసీసీ. ఒక్కదాంట్లో ఐదు చొప్పున నాలుగు గ్రూప్లను చేసింది. ఆతిథ్య దేశమైన టీమిండియా గ్రూప్లో పాకిస్థాన్ మాత్రమే పెద్ద జట్టు. కానీ, శ్రీలంక గ్రూప్లో ఆస్ట్రేలియా ఉండడంతో ఆ జట్టుకు కఠిన సవాల్ ఎదురవ్వనుంది. ఇక గ్రూప్ 3లో ఇంగ్లండ్, వెస్టిండీస్.. గ్రూప్ 4లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి టెస్టు క్రికెట్ ఆడే జట్లు ఉన్నాయి.
గ్రూప్ -1 : భారత్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్ఏ.
గ్రూప్ -2 : శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్.
గ్రూప్ -3 : ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ.
గ్రూప్ -4 : దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్, యూఏఈ, కెనడా.
ఫిబ్రవరి 7 – పాకిస్థాన్ vs నెదర్లాండ్స్ – కొలంబో, ఉదయం 11:00 గంటలకు
ఫిబ్రవరి 7 – వెస్టిండీస్ vs బంగ్లాదేశ్ – కోల్కతా, మధ్యాహ్నం 3:00 గంటలకు
ఫిబ్రవరి 7 – భారత్ vs యూఎస్ఏ – ముంబై , రాత్రి 7:00 గంటలకు
ఫిబ్రవరి 8 – ఇంగ్లండ్ vs నేపాల్ – ముంబై, రాత్రి 7:00 గంటలకు
ఫిబ్రవరి 8 – శ్రీలంక vs ఐర్లాండ్ – కొలంబో, రాత్రి 7:00 గంటలకు
ఫిబ్రవరి 9 – బంగ్లాదేశ్ vs ఇటలీ – కోల్కతా, ఉదయం 11:00 గంటలకు
ఫిబ్రవరి 9 – జింబాబ్వే vs ఒమన్ – కొలంబో, మధ్యాహ్నం 3:00 గంటలకు
ఫిబ్రవరి 10 – పాకిస్థాన్ vs యూఎస్ఏ – కొలంబో, రాత్రి 7:00 గంటలకు
The schedule for ICC Men’s @T20WorldCup 2026 is here! 📅
The matches and groups were unveiled at a gala event in Mumbai led by ICC Chairman @JayShah, and with new tournament ambassador @ImRo45 and Indian team captains @surya_14kumar and Harmanpreet Kaur in attendance.
✍️:… pic.twitter.com/fsjESpJPlE
— ICC (@ICC) November 25, 2025
ఫిబ్రవరి 11 – ఆస్ట్రేలియా vs ఐర్లాండ్ – కొలంబో, మధ్యాహ్నం 3:00 గంటలకు
ఫిబ్రవరి 11 – ఇంగ్లండ్ vs వెస్టిండీస్ – ముంబై, రాత్రి 7:00 గంటలకు
ఫిబ్రవరి 12 – శ్రీలంక vs ఒమన్ – క్యాండీ, ఉదయం 11:00 గంటలకు
ఫిబ్రవరి 12 – భారత్ vs నమీబియా – ఢిల్లీ, రాత్రి 7:00 గంటలకు
ఫిబ్రవరి 13 – ఆస్ట్రేలియా vs జింబాబ్వే – కొలంబో, ఉదయం 11:00 గంటలకు
ఫిబ్రవరి 13 – యూఎస్ఏ vs నెదర్లాండ్స్ – చెన్నై, రాత్రి 7:00 గంటలకు
ఫిబ్రవరి 14 – ఐర్లాండ్ vs ఒమన్ – కొలంబో, ఉదయం 11:00 గంటలకు
ఫిబ్రవరి 14 – ఇంగ్లండ్ vs బంగ్లాదేశ్ – కోల్కతా, మధ్యాహ్నం 3:00 గంటలకు
ఫిబ్రవరి 15 – వెస్టిండీస్ vs నేపాల్ – ముంబై, ఉదయం 11:00 గంటలకు
ఫిబ్రవరి 15 – యూఎస్ఏ vs నమీబియా- చెన్నై, మధ్యాహ్నం 3:00 గంటలకు
ఫిబ్రవరి 15 – భారత్ vs పాకిస్థాన్ – కొలంబో, రాత్రి 7:00 గంటలకు
ఫిబ్రవరి 16 – ఇంగ్లండ్ vs ఇటలీ – కోల్కతా, మధ్యాహ్నం 3:00 గంటలకు
ఫిబ్రవరి 16 – ఆస్ట్రేలియా vs శ్రీలంక – క్యాండీ, రాత్రి 7:00 గంటలకు
ఫిబ్రవరి 17 – బంగ్లాదేశ్ vs నేపాల్ – ముంబై, రాత్రి 7:00 గంటలకు
ఫిబ్రవరి 18 – పాకిస్థాన్ vs నమీబియా – కొలంబో, మధ్యాహ్నం 3:00 గంటలకు
ఫిబ్రవరి 18 – భారత్ vs నెదర్లాండ్స్ – అహ్మదాబాద్, రాత్రి 7:00 గంటలకు
ఫిబ్రవరి 19 – వెస్టిండీస్ vs ఇటలీ – కోల్కతా, ఉదయం 11:00 గంటలకు
ఫిబ్రవరి 19 – శ్రీలంక vs జింబాబ్వే – కొలంబో మధ్యాహ్నం 3:00 గంటలకు
ఫిబ్రవరి 20 – ఆస్ట్రేలియా vs ఒమన్ – క్యాండీ, రాత్రి 7:00 గంటలకు